ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం ఐంది. రెండున్నర కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్.. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర కొనసాగనుంది.
ఎన్టీఆర్ మార్గ్ 4వ నెంబర్ దగ్గర నిమజ్జనం కానుంది ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ౨ గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు చేశారు. కాగా, ఖైరతా బాద్ మహాగణపతి హుండీ ఆదాయం 70 లక్షలను తాకింది. హోర్డింగులు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో 40 లక్షలు సమకూరినట్టు సమాచారం. అయితే ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల ద్వారా వచ్చిన విరాళాలను లెక్కించాల్సి ఉంది.
https://www.youtube.com/live/3zgGRgHD-es