నేటి నుంచి హైదరాబాద్ లో రెండు రోజుల పాటు వైన్స్ బంద్

-

తెలంగాణ మందుబాబులకు బిగ్ అలెర్ట్. ఇవాళ , రేపు వైన్స్ బంద్ కానున్నాయి. హైదరాబాద్‌ లో ఇవాళ, రేపు రెండు రోజులు వైన్స్ బంద్ చెయ్యాలని సీపీ ఆనంద్ ఉత్తర్వులు వారి చేసారు. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Wines Bandh in Hyderabad for two days from today

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 6 గంటల నుండి రేపు సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్స్, బార్, కల్లు కాంపౌడ్లు బంద్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆదేశాలను ఎవరైనా ఉలంగిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని హెచ్చరించారు, అదే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జంట నగరాల పరిధిలోని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌ల అదనపు ఇన్‌స్పెక్టర్‌లకు అధికారం ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news