కామారెడ్డిలో దారుణం.. 21 మంది మహిళలను లైంగికంగా వేధించిన డాక్టర్ ?

-

వైద్యాధికారి తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్ల ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఇప్ప్పుడు హాట్ టాపిక్ ఐంది. కామారెడ్డి జిల్లా వైద్యాధికారిపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు, కలెక్టర్‌కు 21 మంది పీహెచ్సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు సంతకాలు చేసి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర కాలంగా తమతో అనుచితమైన పదాలతో మాట్లాడుతూ శరీర భాగాలను తాకుతున్నాడు.

Complaint of 21 women medical officers that the medical officer was sexually harassing them

పీహెచ్సీలను సందర్శించినప్పుడు మహిళా వైద్యులు, సిబ్బందిని పక్కన కూర్చోవాలనిచెబుతున్నాడు. ప్రతిఘటిస్తే గట్టిగా అరిచి కక్ష పెట్టుకుంటున్నాడు. ఫోన్లో వైవాహిక స్థితిగతులను అడిగి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంతేకాదు తన చాంబర్లో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన జరిగిన విస్తృత సేవల శిక్షణ కార్యక్రమంలో అకస్మాత్తుగా వచ్చి మహిళా వైద్యులు, సిబ్బంది వ్యభిచారిణులుగా పనిచేస్తున్నారని అని అరిచాడని వాపోయారు.
సాక్ష్యాలతో సహ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version