రాష్ట్రంలో సంపూర్ణంగా కులగణన నిర్వహించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్ లో తాజాగా కులగణన, ఎస్సీ వర్గీకరణ పై డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణకు అడుగులు పడ్డాయి. ఈ దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు మా ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేపట్టామని తెలిపారు. శాసన మండలిలో ఫిబ్రవరి 04 2024న తీర్మాణం చేయగా.. శాసన సభలో ఫిబ్రవరి 16, 2024న తీర్మాణం చేసినట్టు తెలిపారు. అక్టోబర్ 10, 2024న జీవో విడుదల చేసి సర్వే పై అసెంబ్లీలో చెప్పడం జరిగింది. శాసనసభ తీర్మాణాన్ని చదివి వినిపించారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాల వల్లనే మార్పులు వచ్చాయని తెలిపారు.