మన భారతీయ సంస్కృతిలో వండుకునే విధానంలోనే ఆరోగ్యానికి పరిరక్షించునే విధంగా.. ఔషధగుణాలు తినేపదార్థాల ద్వారా వెళ్లిపోతే.. సహజంగా జబ్బులను తగ్గించుకోవడానికి ఉపయోగపడే విధంగా వంటలు రూపొందిచారు. డాక్టర్లు, మందులు, ఆసుపత్రులు లేని రోజుల్లో మన భారతదేశంలో బుుషులు మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు.
అలాంటి ప్రకృతి ప్రసాదించిన ఔషదాల్లో ఉన్న విలువలను తెలుసుకుని శరీరానికి అందించే విధంగా వంటల రూపంలో మనకు పూర్వీకులు వాడేవారు.. అందుకే వంటల్లో లవంగాలు, యాలుకలు, దాల్చినచెక్క, పసుపు, వెల్లుల్లి, గసగసాలు. పెద్దోళ్లు వండిన వంటల్లో ఇవన్నీ వేస్తారు. కానీ మన పేరెట్స్ వండే వంటల్లో ఇవి ఎక్కువగా వాడరు.
మరికొంతమంది వీటిని వాడుతున్నారు కానీ.. వాడే విధానం తెలియక కొన్ని రకాలకు ఇబ్బందులకు గురువుతున్నారు.. ఈరోజు వీటిల్లో గసగసాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
గసగసాలను రోజు వంటల్లో వాడరు.. ఎప్పుడన్నా స్పెషల్ వంటల్లోనే వాడుతారు. అయితే దీనికి కారణం..అవి ఖరీదు అందుకే అన్నింటిలో వేయం అని మన అమ్మవాళ్లు చెప్తారు.. కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం అది కాదు. గసగసాలతో నూనె వస్తుంది. ఈ నూనె కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. అయితే రోజుకు 30 గ్రాములు మించి లోపలికి వెళ్లకూడదు. వంటల్లో అయినా సరే. అంకు మించి వాడితే..సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పదిగ్రాముల గసగసాల్లో 4 గ్రాముల కొవ్వు ఉంటుంది.
గసగసాలు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే..
గసగసాల్లో ఉండే పాలిఫినాల్స్ అనేవి హార్ట్ లో బ్లడ్ విజల్ స్లాట్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా బాగా కాపడతాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇందులో ఉండే పాలిఫినాల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిస్టులు తెలిపారు. హార్ట్ లైఫ్ ను పెంచడానికి, హార్ట్ హెల్త్ కండీషన్ ను పెంచడానికి ఇవి పనిచేస్తాయి.
గసగసాల్లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి..బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో ఉండే ఆల్కలైయిడ్ ముఖ్యంగా మార్ఫిన్, కోడిన్ ఇట్లాంటివి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి. కొకైన్ లాంటిది తీసుకున్నప్పుడు ఎలాంటి నొప్పులు ఉండవు.. మనసుకు హాయిగా ఉంటుంది.. కానీ అది ప్రాణహాని.. గసగసాల్లో ఉండే..ఈ కెమికల్ కాంపౌండ్స్ కొద్దిమోతాదులో ఉండటం వల్ల బాడీలో నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి.
గసగసాలు నూరినప్పుడు మంచి సువాసన వస్తుంది. గ్రేవీ కోసం మాంసాహారాల్లో వాడుతుంటారు. కానీ ఇది మోతాదుకు మించి వాడితే.. రివర్స్ లో ఎక్కువ డామేజ్ చేస్తుందని సైంటిస్టులు అంటున్నారు. వాడాలి.. కానీ తక్కువ మోతాదులో వాడాలి. ఇందులో ఉండే ఫైవనాయిడ్స్.. ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మన శరీరంలో ఉండే కణపొరను రక్షిస్తాయి. కణాన్ని రక్షించే కణపొర డామేజ్ అవకుండా ఇది రక్షిస్తుంది.
గసగసాలను డికాషన్ గా చేసుకుని తాగినా.. చస్ట్ లో ఉండే ఇబ్బంది..కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది.. అలాంటివారికి.. లంగ్స్ ఉండే ఫ్లమ్ తగ్గించి.. కఫం అంతా బయటకు వచ్చేట్లు చేసి కంజషన్ తగ్గించి ఫ్రీ చేయడానికి గసగసాలు ఉపయోగపడుతున్నాయని సైంటిస్టులు నిరూపించారు.
ముఖ్యంగా గసగసాల్లో ఉండే ఆల్కలాయిడ్స్ మత్తుని కలిగిస్తాయి. పూర్వం రోజుల్లో పాలల్లో కాస్త గసగసాలను పేస్ట్ చేసుకుని తాగేవారట.. నిద్రబాగా పడుతుంది.
ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ గసగసాల్లో ఉన్నాయని 1992వ సంవత్సరంలో ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్.. ఫోరెన్ సిక్ మెడిసిన్ సింగపూర్( Institute Of Science And Forensic Medicine- Singapore) వారు నిరూపించారు. మన బుుషులు ఏనాడో చెప్పారు..కానీ ఈరోజుల్లో సైంటిఫిక్ గా నిరూపిస్తేనే నమ్మకం కలుగుతుంది.
మన పెద్దోళ్లుక తెలుసు.. పొట్లకాయ, సొరకాయ, బీరకాయ లాంటి వాటిల్లో వాడరు.. స్పెషల్ కర్రీస్ లోనే వాడాలి. ఎలా గసగసాలను వాడొచ్చంటే.. పేస్టే చేసి.. నీళ్లలో వేసి మరిగించి తేనె కలుపుకుని తాగొచ్చు. పేస్ట్ చేసి పాలల్లో కలిపి తాగొచ్చు. గసగసాలను దోరగా వేయించి.. వేడిగా ఉన్నప్పుడే క్లాత్ లోకట్టి వాసన చూస్తే.. నిద్రలోకి జారుకుంటారని సైంటిఫిక్ గా తెలిపారు. ఇలా సందర్భానుసారి.. తగిన మోతాదులో గసగసాలను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి.. అప్పుడప్పుడు వాడేందుకు ప్రయత్నించండి.