చంద్రబాబు, కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నేతలకు నియామక పత్రాలను అందించారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. మార్పు కావాలనే ప్రజల ఆకాంక్షను యూత్ కాంగ్రెస్ విజయం సాధించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ, ఉచిత బస్సు, ధాన్యానికి బోనస్, రైతు భరోసా అందించామని తెలిపారు. పార్టీలో అగ్ర నేతలంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది. యూత్ కాంగ్రెస్ నాయకులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. డబ్బులతోనే ఎన్నికల్లో గెలవరు. మందుల సామేలు డబ్బులు లేకుండానే భారీ మెజార్టీతో విజయం సాధించారని గుర్తు చేశారు. కేసీఆర్ దగ్గర వేల కోట్లున్నాయని తెలిపారు.