తెలంగాణ రాష్ట్ర విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీ లో గందరగోళం నెలకొంది. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్ , గత మంత్రులు, అధికారుల పేర్లు ఉన్నాయట. 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్య పుస్తకాల్లోని ముందుమాట పేజీలో పొరపాటు జరిగిందట. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో ముద్రణ చేశారట.
దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పేజీ తొలగించి విద్యార్థులకు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారట. దీంతో ఆ పేజీ తొలగింపుతో వెనుకవైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ లేకుండానే పుస్తకాలు ఉన్నాయని సమాచాంర. కానీ ఈ విషయం తెలియక బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. విద్యా శాఖ వీటి లో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.