కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆప్ పాలిట కట్టప్ప పాత్ర పోషించిన కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ సెటైర్లు పేల్చుతోంది. 10కి పైగా సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా మాత్రమేనని చెబుతోంది.
బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న సీట్లలో 100 ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆప్ ఓట్ షేరింగ్ ను దెబ్బతీసి..బీజేపీని ఢిల్లీ సింహాసనం పై కూర్చొబెడుతున్న కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ర్యాగింగ్ చేస్తోంది. ఇలాంటి నేపథ్యం లోనే… ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. దాదాపు 27ఏళ్ల తరువాత అధికార పీఠాన్ని దక్కించుకోబోతుంది. ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 సీట్లను దాటి 43 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw
— KTR (@KTRBRS) February 8, 2025