Zero for the third time in the results of Delhi: ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. 40కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆప్ రెండో స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్.. ఈ సారి ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Zero-for-the-third-time-in-the-results-of-Delhi.webp)
అయితే ఈ సారి కూడా కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు షాక్ కి గురవుతున్నారు. ఈ తరునంలోనే…కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ సెటైర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆప్ పాలిట కట్టప్ప పాత్ర పోషించిన కాంగ్రెస్ అంటూ బీఆర్‌ఎస్ పార్టీ సెటైర్లు పేల్చుతోంది. 10కి పైగా సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా మాత్రమేనని చెబుతోంది.