కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..!

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా వికసిత్ భారత్ కోసం తమ పార్టీ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ  ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. “ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని చెప్పారు. 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఈ సందర్భంగా మోడీ పలు విమర్శలు చేశారు.

బీఆర్ఎస్  ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేసా.. మోదీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతాం” అని  ప్రధాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version