దీక్షా దివస్ జరపకూడదంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ మరో ఫిర్యాదు ఇచ్చింది. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం 29 నవంబర్ 2009న చేసిన ఆమరణ నిరాహార దీక్షని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దీక్ష దివస్ జరుపుకుంటుంది తెలంగాణ.
అయితే రేపు దీక్షా దివస్ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రతి సంవత్సరం జరుపుకునే దీక్షా దివాస్ జరుపుకోవడానికి ఇప్పుడు కొత్తగా అనుమతి ఏంటీ ? అని తెగేసి చెబుతుంది బిఆర్ఎస్ పార్టీ. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కాగా, ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ షురూ కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.