కేటీఆర్ ఒక ట్విట్టర్ పిట్ట అని పేర్కొన కాంగ్రెస్ కార్పొరేటర్..!

-

కేటీఆర్ ఒక ట్విట్టర్ పిట్ట. బస్సు టైర్ ఊడిపోయినా ట్విట్టర్ లో పెడతాడు అని కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నాననే అపోహలో ఉన్నాడు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటానని కేటీఆర్ చెబుతున్నాడు. అంటే అక్రమార్కులకు అండగా ఉంటానని చెభుతున్నవా కేటీఆర్ అని ప్రశ్నించాడు.

జన్వాడా ఫాం హౌస్ నాలా ఆక్రమించి నిర్మించారని బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అధికారులు నిర్ధారించారు. బల్కాపూర్ నాలా ను కబ్జా చేసి రోడ్డు గా వినియోగించుకుంటున్నారు. జన్వాడా కబ్జా చేసి కట్టిందని జాయింట్ రిపోర్ట్ వచ్చింది. సత్యాన్ని దాచిపెట్టి ప్రయత్నం చేయొద్దు. కబ్జా చేసి కట్టారని తేలితే.. ఇప్పుడు నాది కాదు మా స్నేహితుడిది అని చెభుతున్నావ్. అబ్రక దాబ్రా అన్నట్టు కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నాడు. 24.06.22 లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలా కబ్జా అయ్యినట్లు ఇరిగేషన్, రెవిన్యూ శాఖ తేల్చి చెప్పింది. తొమ్మిదేళ్లు అక్రమాలు చేసింది మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్రమ కట్టడాలపై ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు మీరేమో అక్రమ కట్టడాలు చేసిన వారికి అండగా ఉంటాం అంటున్నారు అని కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version