పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నేటి నుంచి కాంగ్రెస్‌ నిజనిర్ధరణ కమిటీ ఆరా

-

పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఆశించిన సీట్లు ఎందుకు రాలేదన్న అంశంపై ఏఐసీసీ ఆరా తీసింది. కొందరు నాయకులు సహకరించకపోవడంతో ఫలితాలు తారుమారైనట్లు గుర్తించింది. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా ఫలితాలను సమీక్షించిన ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గేందుకు గల కారణాలను అన్వేషించేందుకు నిజనిర్ధారణ కమిటీలను వేసింది.

మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిషా, ధిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణకి నిజనిర్దారణ కమిటీలను అధిష్ఠానం పంపింది. నిజనిర్దారణ కమిటీ సభ్యులు పి.జె.కురియన్‌, రాకిబల్‌ హుస్సేన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గెలుస్తామన్న  విశ్వాసంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉండగా కేవలం8 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికలయ్యే వరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై నిజనిర్ధారణ కమిటీ ఆరా తీయనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదన్న భావన అధిష్టానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మహబూబ్నగర్, మల్కాజిగిరి, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఫలితాలపై కమిటీ సభ్యులు ఆరాతీసే అవకాశమున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news