కాంగ్రెస్ కు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేరని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుకు రూ.7వేలు ఇస్తోందని ఆరోపించారు. డబ్బుల కోసమే ఎల్ఆర్ఎస్ పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవీ ముఖ్యం కాదని.. ప్రజల కోసం కొట్లాడటమే తనకు ముఖ్యం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మాటల తూటాల పేలుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు బీజేపీ లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. కరీంనగర్ లో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రులను మోసం చేస్తోందని ఆరోపించారు.