కేటీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలబడుతున్నారని.. వాల్లిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ అని మార్కెట్ లో చెప్పుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. జేఏసీ వాళ్లు ధర్నాలు చేస్తే మధ్యలో పింక్ జెండా పెట్టి రాజకీయ పబ్బ గడుపుకునే మూర్ఖుడు కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేసి పేదలు కేసులు అనుభవిస్తుంటే ఛాయలు అమ్ముతున్నట్టు దోసెలు వేసినట్టు కూరగాయలు అమ్ముతున్నట్టు ఫొటోలు దిగి పాల్త్ రాజకీయాలు చేసిన వ్యక్తి కేటీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

తాను కేటీఆర్ లా తన తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదన్నారు. డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేశాను. తొలి నుంచి కేసులు భరించాను. జైలుకు పోయా. లాఠీ దెబ్బలు తిని ఈ స్థాయిలోకి వచ్చిన కార్యకర్తను. నువ్వు ఎలా రాజకీయాల్లోకి వచ్చావో చెప్పాలి. ఉద్యమకారుడిలా కేసీఆర్ చెలామణి అయ్యారు. ఉద్యమం తీవ్రంగ ఉన్న సమయంలో నవ్వు దోశలు వేసి ఫోటోలు దిగి, ఉద్యమకారుడిగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్న కేటీఆర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news