కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంచలన నిర్నయం తీసుకుంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు అప్పగించింది అధిష్టానం. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ప్రయత్నం చేయడమే వారి ప్రధాన బాధ్యతగా ఆదేశాలు జారీ చేసింది.
ఒక వేళ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే…అన్ని బాధ్యతలు జానారెడ్డి..కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మునుగోడు ఎన్నికలు, అభ్యర్ధి ఎంపిక అంతా వారికే బాధ్యతలు ఇస్తున్నట్లు ప్రకటించేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పరిస్థితిని బట్టి… మునుగోడులో ఓ బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్నయం తీసుకుంది. కాగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలోకి వెళతారనే ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.