కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. బిజెపి నేతలు కంగనాని ముందు పెట్టి ఎమర్జెన్సీ పై సినిమా తీయించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని.. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు అనేది ప్రజలకు తెలుసు అన్నారు కోదండ రెడ్డి.
సుప్రీంకోర్టు కూడా ఎమర్జెన్సీని సమర్థించిందని తెలిపారు. మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ చరిత్రని, గాంధీ కుటుంబాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పాలన ఎలా సాగిందో తెలుసుకోవాలన్నారు. నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు నెహ్రూ హైదరాబాద్ కి పటేల్ ని పంపించారని అన్నారు.
నిజాం పాలన మారడానికి ఏడాది సమయం పట్టిందని.. నెహ్రూ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోలేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినంతమాత్రాన.. పటేల్ ని మోడీ సొంతం చేసుకోలేరు అన్నారు కోదండ రెడ్డి.