మెదక్ లోని గోమారంలో నర్సాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటన జరిగింది. నర్సాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్.. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇంటి ముందు టపాసులు పేలుస్తూ గేటు నుంచి లోపలికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..అనంతరం దాడి చేశారు. లోపలికి వెళ్లి BRS కార్యకర్తలపై దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాళ్లు, కర్రలతో లోపలికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు… BRS కార్యకర్తలపై దాడి చేశారు. ముగ్గురు లోపలికి వచ్చి నానా బూతులు తిట్టారని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఈ సంఘటన పై హరీష్ రావు కూడా సీరియస్ అయ్యారు.