దొరికిపోయిన కేసీఆర్: ఉస్మానియా పేరు చెప్పి “ఆ నాలుగు” మాట తీశారుగా!!

-

తెలంగాణ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైనా ఉందంటే.. కరోన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి.. దాని దారుణ పరిస్థితే అని చెప్పొచ్చు! అందుకు కారణం… తాజాగా చెరువును తలపించిన ఉస్మానియా ఆసుపత్రి దీన పరిస్థితి! చుట్టూ డ్రైనేజీ వాటర్, మధ్యలో మంచాలు, వాటిపై కదలలేని పేషెంట్లు… మధ్య మధ్యలో నీటిని బయటకు గెంటే పనులు! ఈ ధౌర్భాగ్యమైన పరిస్థితికి వేదికైంది వందేళ్ల పైబడిన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రి!

హైదరాబాద్ లో ఒక మోస్తరు వర్షాలు కురవడంతోనే కాదు… ఉస్మానియా ఆసుపత్రి కింద ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ పగిలిపోవడం తో ఉస్మానియా ఆసుపత్రి డ్రైనేజీ కం వర్షం నీటితో నిండిపోయింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అయితే ఈ విషయంలో ఎదురుదాడిలో భాగమో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ… ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్త ఆసుపత్రి కడతామని 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే… ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని చెబుతుంది ప్రభుత్వం! హెరిటేజ్ బిల్డింగ్ అయిన ఉస్మానియాను కూల్చొద్దని చెప్పాం కానీ.. ఇంకా పదుల సంఖ్యలో ఎకారాల స్థలం కలిగిన దానిపక్కన మరో ఆసుపత్రి కట్టొద్దని తాము చెప్పలేదనేది ప్రతిపక్షాల లాజిక్! ఈ సమయంలో 2016లో కేసీఅర్ ఇచ్చిన మాట వెలుగులోకి వచ్చింది!

27ఎకరాల స్థలంలో 3 ఎకరాలలో ఉన్న బిల్డింగ్ స్ట్రెంగ్తెన్ చేయవద్దని ప్రతిపక్షాలు అనలేదని.. హెరిటేజ్ బిల్డింగ్ అయిన ఉస్మానియాను కూల్చొద్దని మాత్రమే తామన్నామని మొదలుపెట్టిన ప్రతిపక్షాలు… 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్… హైదరాబాద్ చుట్టూ ఉస్మానియా తరహాలో నాలుగు భారీ హాస్పటల్స్ కడతామని నాడు మాటిచ్చారని.. పైగా వాటిని రెండేళ్లలోనే పూర్తిచేస్తామని చెప్పారని గుర్తుచేస్తున్నాయి!

అందులో భాగంగా ఆ నాలుగు ఆసుపత్రులను… ఉప్పల్ – ఎల్బీనగర్ మధ్యలో ఒకటి.. కుత్బుల్లాపూరు – మల్కాజ్ గిరి పక్కన ఒకటి.. శేర్ లింగంపల్లి – కూకట్ పల్లి మధ్యలో ఒకటి.. రాజేంద్రనగర్ – శంషాబాద్ మధ్యలో ఒకటి కడతానని చెప్పారు.. దానిపై ప్రతిపక్షాలు ఏమైనా కేసులు వేశాయా.. కట్టొద్దని చెప్పాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి! విచిత్రం ఏమిటంటే… ఈ విషయాలపై ప్రభుత్వం నుంచి సరైన సూటైన సమాధానం రావడం లేదు!! దీంతో కేసీఆర్ ఈ విషయంలో ప్రతిపక్షాలకు దొరికిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version