పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజ

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. ఖమ్మం 9 స్థానాల్లో కాంగ్రెస్‌, ఒక చోట సీపీఎం లీడ్‌లో ఉన్నాయి. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్‌, మధిరలో భట్టి విక్రమార్క లీడ్‌లో ఉన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు.. వీళ్లు ముందంజ

  • బెల్లంపల్లిలో వినోద్‌ (కాంగ్రెస్‌)
  • ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)
  • కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌ (కాంగ్రెస్‌)
  • చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ (ఎంఐఎం)
  • కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి (బీజేపీ)
  • పరకాల: రేవూరి ప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్‌)
  • పాలేరు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్‌)
  • నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • వర్ధన్నపేట: కె.ఆర్‌.నాగరాజు (కాంగ్రెస్‌)
  • గోషామహల్‌లో భాజపా అభ్యర్థి రాజాసింగ్‌ ముందంజ
  • అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదినారాయణ ముందంజ
  • ములుగు పోస్టల్‌ బ్యాలెట్లలో ములుగు సీతక్క ముందంజ
  • కామారెడ్డి పోస్టల్‌ బ్యాలెట్లలో రేవంత్‌రెడ్డి ముందంజ
  • సిద్దిపేట పోస్టల్‌ బ్యాలెట్లలో భారాస అభ్యర్థి హరీశ్‌రావు ముందంజ
  • భువనగిరి పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్‌ ముందంజ
  • వర్ధన్నపేట పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ముందంజ

Read more RELATED
Recommended to you

Exit mobile version