ఇల్లెందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య గుండాయిజం చేస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా ఎత్తుకెళ్ళి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఇవాళ ఉదయం నుంచి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం పై హైడ్రామా చోటు చేసుకుంది. దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా ఎత్తుకెళ్ళి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేయించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు. దింతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచ్చిన కొంతమంది కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారు.మరికొద్ది క్షణాలలో అవిశ్వాస ప్రక్రియ మొదలవుతుంది అనగా ఎంపీడీవో కార్యాలయం పై… కాంగ్రెస్ కార్యకర్తలు…దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.