కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల పై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ డిలీట్ అయిందని…కాంగ్రెస్ఎంపీ అనిల్‌కుమార్ సంచలన వీడియో పెట్టారు. ప్రధాని మోదీ ట్వీట్‌ను డిలీట్ చేసుకోవడం అంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించనట్టే అంటూ సెటైర్లు పేల్చారు ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేవడం లేదని మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ రీ ట్వీట్ చేశారన్నారు. దానిని చూసిన మోదీ వాస్తవాలను సరి చూసుకుని తన ట్వీట్‌ను డిలీట్ చేశారని క్లారిటీ ఇచ్చారు. ఇకనైనా మోదీ భజన బృందం విమర్శలు మానుకుని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు కాంగ్రెస్ఎంపీ అనిల్‌కుమార్.