చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఏపీ స్కీల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఏమైనా పాకిస్తానా!!అంటూ ఫైర్ అయ్యారు.

హైదరాబాద్లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగింది. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.