బీఆర్ఎస్ తన ప్రైవేట్ ఆర్మీతో కలిసి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తోంది : కాంగ్రెస్ ఎంపీలు

-

బీఆర్ఎస్ నేతలు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. నియమావళి ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచన చేశామని వెల్లడించారు. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తిచేయాలని చెప్పామని.. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసి.. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని చెప్పామని కానీ కేసీఆర్ సర్కార్.. విశ్రాంత అధికారులకు పదవులు ఇచ్చి ప్రైవేటు ఆర్మీగా వాడుతోందని ఆరోపణలు చేశారు.

‘ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా ప్రైవేటు ఆర్మీని వాడుతున్నారు. విశ్రాంత అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పాం. ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌రావు, నర్సింగ్‌రావు, రాధాకిషన్‌రావు, జగన్మోహన్‌రావు, భుజంగరావు, ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ జీతభత్యాలతో ప్రైవేటు ఆర్మీని నియమించారు. కొత్త ఆర్మీతో కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేయించి కేసులు పెడుతున్నారు. కీలకమైన శాఖలను కొందరు ఐఏఎస్‌లు ఏడెనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. జయేశ్‌ రంజన్‌, అర్వింద్‌ కుమార్‌, సోమేశ్‌ కుమార్‌ కీలకశాఖలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్​కు ఎన్నికల నిధులు ఇవ్వాలని.. కాంగ్రెస్‌కు పైసా సాయం చేయవద్దని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు.’ అని కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తీవ్ర ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news