నేడు కాంగ్రెస్ చలో పాలమూరు.. బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా !

-

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు ఉండనుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పారు చల్లా వంశీచంద్ రెడ్డి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది.

 

congress

చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్‌ నుంచి బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు పయనం కానుంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఈ పర్యటన చేపట్టింది. మొదట మేడిగడ్డలో పర్యటించి అనంతరం అన్నారం బ్యారేజీని సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌ మినహా మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు మేడిగడ్డ సందర్శించే అవకాశం ఉంది. వీరితో పాటు పలువురు నీటిపారుదల శాఖ నిపుణులు కూడా వెంట వెళ్లనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version