రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు భరోసా ఇద్దామా..? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో రైతు భరోసా విధి, విధానాలపై ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు. మీరు అంతా మంచి చేసి ఉంటే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
అబద్దాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు.. ఉపాధ్యక్షుడు వచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చాడు. గత పదేళ్ల పాలన పై సభ్యులకు సభలో సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని సభకు రాలేదని తెలిపారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి వేసిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. ప్రతీ పక్ష నేతలు చెప్పకపోయినా.. వారు రాత పూర్వకంగా ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.