కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా. ఓ మీడియాలో ఛానల్ డిబేట్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా మాట్లాడుతూ… మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆమెను మంత్రి పదవి నుండి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శ్యామ్ ప్రసాద్.

దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇక అటు కొండా సురేఖ వ్యాఖ్యలపై పరోక్షంగా కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని.. మాట్లాడాలంటూ సెటైర్లు పేల్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కావడంతో.. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు.