BREAKING : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.నాగయ్య కన్నుమూత

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి 2 గం.కు బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగయ్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. నాగయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి జీవితకాలం పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నాగయ్య కీలకపాత్ర పోషించారన్న సీఎం.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాగయ్య కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకులుగా, మేధావిగా గుర్తింపు పొందారు. నాగయ్య లాంటి విద్యావంతులు, మేధావి, ఉద్యమ కారుడి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండ రెడ్డి, నిరంజన్ నాగయ్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news