రేపటి నుంచి కాంగ్రెస్ అసలు స్వరూపం చూడాలి : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. ఆదివారం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.

మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని బీజేపీకి మెజార్టీ తగ్గడానికి కాంగ్రెస్, మజ్లిస్ స్నేహం కారణం అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపల్లిలో ప్రచారం చేయలేదు. ఇంటింటికి కరపత్రాలు పంచలేదు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి లక్ష 2 వేల ఓట్లు వస్తే బీజేపీపై 62 వేల మెజార్టీ సాధించింది. జూబ్లిహిల్స్ సెగ్మెంట్ లోను బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది. దీనికి కారణం మజ్లిస్ అన్నారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పేరు మీద మతోన్మాద శక్తులు పోటీ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారన్నారు. సికింద్రాబాద్ లో పోటీ చేసిన అభ్యర్థి, పోటీ చేసిన గుర్తు కాంగ్రెస్సే అయినా నిజానికి అక్కడ పోటీలో ఉన్నది ఎంఐఎం పార్టీ అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version