అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి

-

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనతో మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూస్తున్నారు. మంత్రి లోకేష్ స్పందించాలని విన్నవించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక (25) వెటర్నరీ డాక్టర్.  అమెరికాలోని ఒకలా హోమ్ స్టేట్ ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణిల కుమార్తె. హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది.  ఆమె మృత దేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.   ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ చొరవ తీసుకొని హారిక మృత దేహాన్ని తెనాలికి వచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణవార్త విని శ్రీనివాసరావు, నాగమణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి రోదనలు చూసిన వారు కూడా కంటతడి పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version