BREAKING : కామ్రేడ్స్‌తో పొత్తుల కోసం చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్

-

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం భాగస్వామ్యంలో ఉండటంతో… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో జతకట్టాలని భావిస్తోంది. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ టాక్రేతో వామపక్ష నేతలు సమావేశం అయ్యారు.

పొత్తులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని భావిస్తున్నారు. ఇక అటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ థాక్రేతో ఆర్‌. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 18 డిమాండ్ లపై థాక్రే కు లేఖ ఇచ్చానని ఆర్‌. కృష్ణయ్య పేర్కొన్నారు. దళిత డిక్లరేషన్ మాదిరిగా.. bc డిక్లరేశన్ పెట్టాలని కోరామని.. మళ్ళీ ఓ సారి కలుద్దాం అని చెప్పారని వివరించారు ఆర్‌. కృష్ణయ్య. అన్ని విషయాలు డిక్లరేషన్ లో పెడితే పార్టీకి కలిసి వస్తోంది అని చెప్పానని… పేర్కొన్నారు ఆర్‌. కృష్ణయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version