కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ ట్రాఫిక్ పెరిగిపోయిందని.. వచ్చే మూడు, నాలుగు ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఓఆర్ఆర్ పై రోజుకు 1లక్ష వాహనాలు తిరుగుతున్నాయి. ప్యూచర్ సిటీని డెవలప్ చేయాలి.. ఇంకా ఎక్స్ పాన్షన్ చేయాలే. కోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏవిధంగా ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.
పేదలకు ఏవిధంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు. డిసెంబర్ 07న ప్రమాణం చేస్తే.. డిసెంబర్ 11, 2024న నితిన్ గడ్కరీ వద్దకు వెల్లి 2 గంటలకు పైగా చర్చించి.. 7 సార్లు కలిశామని తెలిపారు. చివరగా మార్చి 11, 2025న అధికారులతో కలిసి నితిన్ గడ్కరీని కలిసినట్టు గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డును వేగవంతం చేయాలని కోరినట్టు తెలిపారు. సంవత్సరానికి రూ.300 కోట్లు వచ్చే రోడ్డును ఎక్కడైనా చూశామా..? అధ్యక్ష ఈ ప్రపంచంలో అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి.