ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలి పోయిన 11 వేల సీట్లు..!

-

కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ముగిసింది. ఈ క్రమంలో స్పాట్ అడ్మిషన్స్ పై ఇంకా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా లో 11 వేల 936 సీట్లు మిగిలి పోయాయి. 175 కాలేజీల్లో కన్వీనర్ కోట లో 86వేల 943 సీట్లు ఉంటే 75 వేల 107 సీట్లతో 86.4 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో 61 వేల 587 సీట్లకు గాను.. 57 వేల 637 భర్తీ కాగా 3 వేల 950 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఇక ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 16 వేల 692 సీట్లు ఉంటే 12 వేల 672 సీట్లు భర్తీ కాగా 4 వేల 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 7 వేల 458 సీట్లకు గాను.. కేవలం 4 వేల 81 సీట్లతో 54.72 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక యూనివర్సిటీ కాలేజీల్లోను 1509 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news