తెలంగాణకు పెను భారంగా రుణాలు..!

-

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం భట్టి మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రికి వినతిపత్రం ఇచ్చాను. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

అయితే పెండింగ్ నిధులను వెంటనే విడదల చేయాలని కోరాం. ప్రస్తుతం తెలంగాణకు రుణాలు పెను భారంగా మారాయి.గత ప్రభత్వం 31,795 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంది. 10.75 శాతం, 11.25 శాతం వడ్డీ రేటుతో ఈ రుణాలు తీసుకుంది. అలాగే రుణాలు “రీస్ట్రక్చర్” చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరాం. ప్రస్తతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే, పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నాం అని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news