రాష్ట్రంలో మ‌రోసారి పెరిగిన కరోనా వ్యాప్తి.. నేడు 1,920 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మ‌రో సారి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,920 కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. కాగ సోమ వారం రాష్ట్రం క‌రోనా కేసులు 1825 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే.. ఈ రోజు 95 కరోనా కేసులు పెరిగాయి. కాగ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల క‌రోనా బులిటెన్ ప్ర‌కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,920 కేసులు వెలుగు చూశాయి. అలాగే ఇద్ద‌రు క‌రోనా కాటుకు బ‌లైపోయారు.

అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 417 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 16,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్ర‌తి రోజు క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. కానీ కరోనా నుంచి కొలుకునే వారి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లుకు సిద్ధం అవుతుంది. ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌లను ప్ర‌భుత్వం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news