కరోనా ఈ రోజో రేపో పోయే సమస్య కాదని తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. కేబినేట్ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని చెప్పారు ఆయన. లాయర్ల కోసం 22 కోట్ల సహాయం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించి పది పరిక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.
వలస కూలీలను ఆదుకుంటాం అని, ఇక్కడే ఉండి పని చెయ్యాలి అనుకునే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని స్పష్టం చేసారు. భౌతిక దూరం పాటించి పది పరిక్షలు నిర్వహిస్తామని, పరీక్షా సెంటర్లను పెంచుతాం అని స్పష్టం చేసారు. ఇక రైతుల గురించి మాట్లాడుతూ… రైతులను ఆదుకోవాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా లో రైతు రాజ్యం నడుస్తుంది అని చెప్పారు.
రైతులు అనవసరంగా రాజకీయాల్లోకి దూరవద్దు అని, ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇప్పటి వరకు ఇన్ని పంటలను కొనుగోలు చేయలేదు అని అన్నారు. కేసీఆర్ బ్రతికి ఉన్నంత వరకు రైతు బంధు పథకం కొనసాగుతుందని చెప్పారు. రైతు బంధు వంద శాతం అందరికి ఇస్తామని ఆయన వివరించారు. మీడియా అనవసరంగా హడావుడి చేయవద్దని ఆయన సూచించారు. రైతులను ధనవంతులను చేసుకునే తెలంగాణా సర్కార్ విశ్రామం తీసుకోదని అన్నారు.
రుణమాఫీ కోసం రేపే 1200 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పేదలు, రైతుల సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదు అని ఆయన స్పష్టం చేసారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. 5.5 లక్షల మందికి రుణ మాఫీ చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.