నిర్మల సీతారామన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి – ఎమ్మెల్సీ కవిత

-

ప్రముఖ వాణిజ్య సంస్థ ఆదాని గ్రూపు పై ఇటీవల అంతర్జాతీయ నివేదికతో ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఒడిదుడుకులు ఏర్పడిన విషయం తెలిసిందే. “అదానీ గ్రూప్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రెండు లక్షల కోట్లు అయితే.. అందులో దేశీయ బ్యాంకులో ఇచ్చిన రుణాలు 80,000 కోట్లు మాత్రమే. మిగతా 1.2 లక్షల కోట్ల రుణాలు విదేశీ బ్యాంకులు ఇచ్చాయి” అని ఈ ఫేక్ నివేదిక ఉద్దేశం.

అయితే అదాని గ్రూపులో అవకతవకలపై వార్తల నేపథ్యంలో ఎల్ఐసి, ఎస్బిఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలలోనూ ఒడిదుడుకులు రావడం ఆందోళనకరమని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సెబీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని కోరారు. అలాగే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాదిమంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో కూడా మాట్లాడాలని సూచించారు. దీనిపై ప్రతి భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version