కవిత జ్యుడీషియల్ రిమాండ్ పై కోర్టు కీలక నిర్ణయం !

-

కవిత జ్యుడీషియల్ రిమాండ్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈడీ, సీబీఐ లిక్కర్ కేసుల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ వర్చువల్ గా కోర్టు ముందు హాజరుకానున్నారు కవిత. లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11 న అరెస్ట్ చేసింది సీబిఐ.

Kavitha

అటు ఇవాళ రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినిపిస్తారు. ఇప్పటికే సీబిఐ కేసులో కవిత బెయిల్ అప్లికేషన్ పై ముగిసాయి వాదనలు. ఈ తీర్పును మే 2 వ తేదీకి రిజర్వ్ చేశారు జడ్జి కావేరి బవేజా. ఇక ఇవాళ వర్చువల్ గా కోర్టు ముందు హాజరుకానున్నారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news