వైరల్ అవుతున్న పోలీసు జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వీడియో.. సీపీ సీవీ ఆనంద్‌ రియాక్షన్ ఇదే

-

ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు ప్రీ వెడ్డింగ్ షూట్ కామన్ అయిపోయింది. కొన్నిజంటలు ఈ షూట్ కోసం చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు కూడా. అలా నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తాజాగా ఓ జంట కూడా ప్రీవెడ్డింగ్ షూట్ చేసి వైరల్ అవుతోంది. అయితే ఈ ఇద్దరూ పోలీసులే కావడం గమనార్హం. పోలీసు యూనిఫామ్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేయడంపై కొందరు మండిపడుతుండగా.. మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోపై తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు.

‘‘ఈ వీడియోపై మిశ్రమ స్పందన వచ్చింది. పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో వారిద్దరూ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు.పోలీసు ఉద్యోగం చాలా చాలా కష్టమైన పని.. ప్రత్యేకించి మహిళలకు ఇంకా కష్టం. ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడం కచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. వారిద్దరూ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ, వారు ముందే మా అనుమతి కోరితే కచ్చితంగా అనుమతించే వాళ్లం. నన్ను పెళ్లికి పిలవక పోయినా, వెళ్లి వారిద్దరినీ ఆశీర్వదించాలని ఉంది. అయితే, కచ్చితమైన అనుమతి తీసుకోకుండా ఇంకెవరూ ఇలాంటి పని చేయొద్దు’’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news