తెలంగాణలో కాంగ్రెస్​తో జట్టు.. సీట్లపై క్లారిటీ రాలేదు : సీపీఐ నారాయణ

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంటోంది. అయితే కాంగ్రెస్​తో పొత్తుపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్​తో రాజకీయ అవగాహన ఒప్పందం కుదిరిందని.. కానీ సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదని నారాయణ చెప్పారు. తాము ఎన్ని సీట్లు కావాలి.. ఎక్కడెక్కడ.. ఎవరికి కావాలనే విషయం స్పష్టంగా హస్తం నేతలకు చెప్పామని తెలిపారు. సీపీఐ, సీపీఎం చెరో ఐదు సీట్ల చొప్పున ప్రతిపాదన పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా సమాధానం రాలేదని అన్నారు.

‘ఎన్నికల వేళ పొత్తులు అనేవి ఎప్పుడు ప్రసవ వేదనే. చర్చలు కొలిక్కి వచ్చాక మేమే ప్రకటన చేస్తాం. పొత్తు, సీట్లపై ఊహాగానాలను నమ్మకండి. ఛత్తీస్​గఢ్​లో 14 చోట్ల సీపీఐ పోటీ సీపీఐ, సీపీఎం కలిసి వామపక్షాలు మొత్తం 40 సీట్ల లో పోటీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్ లో సీపీఐ 15, సీపీఎం 14 సీట్లు లో పోటీ చేస్తున్నాం. రాజస్థాన్లో సీపీఐ 14, సీపీఎం 15 సీట్లలో పోటీ చేస్తున్నాం. ఎన్నికల ముందు కావాల్సిన అధికారులను అధికార పార్టీలు బదిలీ చేసుకున్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాను.’ అని నారాయణ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news