టీఆర్ఎస్ నేతలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఒకవేళ కేసీఆర్ మోడీ జై అంటే రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమైపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, వ్యక్తులపై కేంద్రం ఏకపక్ష దాడులు జరుపుతోంది.. ఏపీలో వైసీపీ గెలిచిందంటే బీజేపీ గెలిచినట్టే లెక్క.. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ వైసీపీ నుంచి మద్దతు లభిస్తోందన్నారు సీపీఐ నేత నారాయణ.
తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి ఆ పార్టీపై కేంద్రం దాడులు చేస్తోంది.. ఒకవేళ కేసీఆర్.. ప్రధాని మోడీ జై అంటే రాత్రికి రాత్రే కేసులన్నీ మాయమైపోతాయని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌లో శారద, నారద కేసుల్లో ఉన్నవాళ్లు బీజేపీలో చేరగానే ఏమైంది? అని గుర్తు చేశారు సీపీఐ నేత నారాయణ. మోడీకి మద్ధతిచ్చే వైసీపీకి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది…పవన్ కళ్యాణ్ ఎంతవరకు కలిసొస్తారో చూడాలన్నారు.