తెలంగాణలో హంగ్ వస్తే ఎమ్మెల్యేలు పక్కా పార్టీలు మారతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదని.. తెలంగాణలో హంగ్ రాదని స్పష్టం చేశారు. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
“ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది.. అహంభావం ఓడిపోతుంది. కేసీఆర్, కేటీఆర్‌లకు అహంభావం ఎక్కువ. కేసీఆర్‌పై డాటర్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ ప్రభావం పడింది. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబోతున్నారు. రేవంత్ రెడ్డిని శాసనసభా పక్ష నాయకుడిగా కేసీఆర్ ఆహ్వానించాల్సి వస్తుంది. తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకొని నాగార్జున సాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకం అడింద. కేసీఅర్‌ను గెలిపించడం కోసం జగన్ కుట్ర పన్నారుయ పది ముఖ్యమంత్రులు ఉంటే మంచిదే కానీ.. ఒక్క ముఖ్యమంత్రి ఉంటేనే ప్రమాదకరం. అభివృద్ధి తెలంగాణ ప్రజలకా.. కల్వకుంట్ల కుటుంబానికా? ఏ ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ సాధించామో.. ఆ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగించారు.” అని నారాయణ విమర్శించారు.