కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకుంది CPM పార్టీ. కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సిపిఎం యోచిస్తున్నట్లు సమాచారం. 5-8 స్థానాల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుందట. ఇవాళ CPI, CPM కార్యవర్గ సమావేశాలు వేర్వేరుగా జరగనున్నాయి. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ఎటు తేల్చకపోవడంతో ఆ పార్టీ తీరుపై కమ్యూనిస్టులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకట స్వామిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వివేక్ వెంకటస్వామి. అయితే.. సీపీఐకి ఇచ్చిన చెన్నూర్ టికెట్ ను వివేక్ వెంకటస్వామి ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. టికెట్ విషయంపై వివేక్ వెంకట స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడడమే ముఖ్యం అన్నారు కేసీఆర్‌ను గద్దెదించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు వివేక్.