ఎన్‌సీఆర్‌బీ-2022 నివేదిక.. రాచకొండలో అత్యధికం.. ములుగులో అత్యల్ప నేరాలు

-

రాష్ట్రంలో గతేడాది జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికను జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసింది. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నేరాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో.. అత్యల్పంగా ములుగు జిల్లాల్లో జరిగినట్లు నివేదిక వెల్లడించింది. తెలంగాణలో 2022లో మొత్తం ఐపీసీ నేరాలు 1,51,849 జరగగా.. వీటిల్లో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 64వేలకు పైగా నేరాలు చోటు చేసుకున్నట్లు నివేదికలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన నేరాల్లో ఎక్కువగా భౌతిక దాడులకు సంబంధించి 43,338 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

అత్యధిక నేరాలు నమోదైన యూనిట్లు ఇవే

  • రాచకొండ కమిషనరేట్‌: 22,634
  • సైబరాబాద్‌ కమిషనరేట్‌: 20,668
  • హైదరాబాద్‌ కమిషనరేట్‌: 22,000
  • వరంగల్‌ కమిషనరేట్‌: 8,956
  • సూర్యాపేట జిల్లా: 5,654

అత్యల్ప నేరాలు ఇక్కడే

  • ములుగు: 978
  • వనపర్తి: 1155
  • నారాయణపేట: 1275
  • జోగులాంబ గద్వాల: 1347
  • కుమురంభీం ఆసిఫాబాద్‌: 1443

Read more RELATED
Recommended to you

Latest news