హైదరాబాద్ – జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ మ్యాన్ హోల్ కవర్ తెరిస్తే క్రిమినల్ కేసు వేసేందుకు సిద్ధం అయింది. హైదరాబాద్ – జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొందరు వ్యక్తులు మ్యాన్ హోల్ కవర్లు తొలగించగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.
ఏదైనా మ్యాన్‌హోల్ కవర్ దెబ్బతిన్నట్లయితే లేదా తెరిచి ఉన్నట్లయితే 040 – 2111 1111 కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయవచ్చని పేర్కొంది హైదరాబాద్ – జీహెచ్ఎంసీ. అలాగే.. జీహెచ్ఎంసీ మ్యాన్ హోల్ కవర్ తెరిస్తే క్రిమినల్ కేసు వేస్తామని హెచ్చరించింది.
కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లను తెరుస్తున్న విషయం తెలిసిందే. తద్వారా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాలాల్లో పడి ఓ బాలుడి ప్రాణాలు ఇలాగే పోయాయి. ఈ నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. మ్యాన్‌హోళ్లు తెరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది.