నాలుగు నెలలకోసారి ప్రజాపాలన ఉంటుందని ప్రకటన చేశారు CS శాంతి కుమారి. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈనెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని తెలంగాణ సిఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలనకార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజాపాలన సదస్సులు ముగిసిన వెంటనే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ మొదలుపెట్టాలని ఆదేశించారు CS శాంతి కుమారి. వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. డేటా ఎంట్రీపై రాష్ట్రస్థాయి సిబ్బందికి గురువారం, జిల్లాస్థాయి సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని, మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు CS శాంతి కుమారి.