Amala Paul : మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కానీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అమలాపాల్ అసలు పేరు అనఖ. అయితే.. మాలివుడ్ బ్యూటీ అమలాపాల్, జగత్ జోషి వివాహం ఇటీవల జరిగింది.
ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘నీతో కలిపి 1+1=3 కాబోతున్నాం’ అని పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు. జగత్ దేశాయ్ ను ఆమె 2023 నవంబర్ 5న వివాహం చేసుకున్నారు. 2014లో డైరెక్టర్ విజయ్ ను పెళ్లి చేసుకోగా…. సినిమాల్లో కొనసాగేందుకు అతడు ఒప్పుకోకపోవడంతో 2017లో ఆమె విడా కులు తీసుకున్నారు.