హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్న సీవీ ఆనంద్

-

CV Anand took charge as Hyderabad CP: సీవీ ఆనంద్..హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. కాసేపటి క్రితమే.. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ కు కృతజ్ఞతలు చెప్పారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానని తెలిపారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి.. ప్రశాంతంగా జరిపామని ప్రకటించారు.

CV Anand took charge as Hyderabad CP

యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందని.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని.. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అన్నారు. ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారని… క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపకతప్పదని హెచ్చరించారు సీవీ ఆనంద్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version