ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చేనేత రంగం ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం చేనేత రంగానికి ఊతమిచ్చేవిదంగా మూడు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది. మంగళగిరిలో జరిగే చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ పథకాలకు శ్రీకారం చుడతారు.కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ముందుకు నడిపించే ఉద్దేశంతో చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపరచడానికి మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.ఈ పథకాలు చేనేత ఉత్పత్తులకు మార్కెట్ ను విస్తరించడం సాంకేతికతను ఆధునికరించడం కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించడం పై దృష్టి సారిస్తాయి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేనేతకు బాసటగా తీసుకువచ్చిన మూడు కొత్త పథకాల గురించి ఇప్పుడు చూద్దాం..
చేనేత సంక్షేమ నిధి: ఈ పథకం చేనేత కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. చేనేత కార్మికులకు సామాజిక భద్రత ఆరోగ్య భీమా పదవి విరమణ ప్రయోజనాలను అందించడం ఈ నిధి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద చేనేత కార్మికుడు నెలవారి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు ఇది వారి జీవనాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా ఈ నిధి ద్వారా చేనేత కుటుంబాలకు రుణ సౌకర్యాలు సబ్సిడీలు అందించబడతాయి.
ఉచిత విద్యుత్ పథకం: చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెడుతుంది. 189.62 కోట్లతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీ మినహాయింపు ఇవ్వనున్నారు. ఇది చేనేత కార్మికులకు వారి జీవనోపాధి మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. చేనేత కార్మికులకు నెలకు 2 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 190 కోట్లు కేటాయిస్తుంది వీటి ద్వారా మగ్గాలపై నేసే చేనేతలకు నెలకు 1200 రూపాయలు సంవత్సరానికి 14 వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.
త్రిఫ్టీ నిధుల మంజూరు: చేనేత కార్మికుల కోసం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగానికి బలోపేతం అయ్యేవిధంగా మూడు కొత్త పథకాలను శ్రీకారం చేయనున్నారు. ఈ పథకాలలో5లక్షల రూపాయలు నిధుల మంజూరు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ స్కీం ద్వారా చేనేత కార్మికులు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.