రేవ్ పార్టీ పై డీసీపీ ప్రెస్ నోట్.. వెలుగులోకి సంచలన విషయాలు

-

జన్వాడ  ఫామ్ హౌజ్ రేవ్ పార్టీపై రాజేంద్రనగర్ డీసీపీ ప్రెస్ నోట్  విడుదల చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జన్వాడలోని రాజ్ పాకాల కు చెందిన ఫామస్ పై  నిన్న అర్ధరాత్రి సమయంలో లోకల్ పోలీసులు, ఎస్ఓటీ, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో దాడి జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఫామ్రాజ్లో 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని అన్నారు. ఈ దాడిలో 7 విదేశీ మద్యం బాటిళ్ళు, 10 లోకల్ మద్యం బాటిళ్ళు, ఇతర గేమింగ్ ఐటమ్స్ ని గుర్తించినట్లు తెలిపారు.

ఫామ్ హౌజ్ లో ఉన్న పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేశామని, ఇందులో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్టు డ్రగ్ టెస్ట్లో తేలిందని, అతనిని రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారని అన్నారు. అంతేగాక రాజ్ పాకాలపై ఎన్టీపీసీ యాక్ట్ 25, 27, 29 తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద మొకిల పోలీస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు ఎక్సైజ్ యాక్ట్ 34ఏ, 34(1) సెక్షన్ల కింద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version